PPM: కురుపాం గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చ కామెర్లు బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చేరిన బాలికలను మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సోమవారం పరామర్శించారు. పార్వతీపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు.