HYD: హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజావాణిలో భాగంగా అనుమతులు లేని లేఅవుట్లతో పాటు రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.