MNCL: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ 4నెలల వేతనాలు చెల్లించాలని TRP జిల్లా నాయకుడు మహేశ్ వర్మ డిమాండ్ చేశారు. సోమవారం శ్రీరాంపూర్ GM కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోచుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దుచేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు.