అనంతపురం నగరంలోని శిశు గృహాన్ని సోమవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అనంతపురం కార్యదర్శి రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పసికందు మృతిపై శిశు గృహంలో పనిచేస్తున్న వారిని విచారణ చేశారు. అనంతరం శిశు గృహంలోని పిల్లల సంరక్షణ, పిల్లలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.