VZM: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం పొందారు. శ్రీ పైడితల్లి అమ్మవారి కృపతో ప్రజలు సుఖశాంతులతో, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.