ASR: డుంబ్రిగూడ మండలం గసబ గ్రామంలో రూ. 4లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని సోమవారం సర్పంచ్ పాంగి సునీత, ఎంపీటీసీ వంతాల జెమ్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ భవనం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అలాగే, గ్రామంలో త్రాగునీరు, వీధి దీపాలు కూడా నిధులు కేటాయించామన్నారు.