KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 58 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు.