SRCL: దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు 3 సంవత్సరల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలో అక్టోబర్ 7, 2017న ఆడపు లక్ష్మణ్ ఇంట్లో బొడ్డు సాయి, పూదరి రాజు బంగారం దొంగిలించారన్నారు. ఈ కేసులో శిక్ష పడిందన్నారు.