NLG: చిట్యాల మండలం నేరడలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. రక్తహీనత ఏర్పడకుండా ఆకుకూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ, ఆశాలు అలివేలు మంగమ్మ, సుజాత, నాగరాణి, సైదమ్మ, వసంత నాగమణి ఉన్నారు.