KDP: రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం వేంపల్లి వ్యవసాయాధికారి శివశంకర్ రెడ్డిని కలిసి ఈ అంశంపై వినతిపత్రం అందజేశారు. కాగా, వరి ధాన్యం మద్దతు ధర రూ.2369 ఉన్నా, దళారులు 81 కేజీల బస్తాను కేవలం రూ.1340కి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.