ఉమ్మడి అనంతపురం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రేపు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది.