GNTR: పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. సోమవారం నియోజకవర్గంలో లబ్ధిదారులకు రూ.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం పేదల ఆరోగ్య భద్రతకు కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు.