MNCL: జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్స్‌లో సీనియర్ సిటిజన్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ మండల అధ్యక్షులు గోపి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కోడూరి చంద్రయ్య, మల్లయ్య ఉన్నారు.