ప్రకాశం: హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి రంగనాయకులను రాష్ట్ర లేబర్, పూర్ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఇంఛార్జ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నియమించింది. ఈ మేరకు నియామక పత్రం అందినట్లు సోమవారం రంగనాయకులు తెలిపారు. కాగా, కార్మిక, పేద వర్గాల అభివృద్ధి కోసం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రంగనాయకులు తెలిపారు.