WGL: వరంగల్ రైల్వే స్టేషన్ ఆవరణంలో ఇవాళ తెలంగాణ పారిశ్రామిక కార్మిక సంఘం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా నాయకుడు రవి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన పేర్కొన్నారు.