BDK: అశ్వారావుపేట మండల తహసీల్దార్ సిహెచ్ రామకృష్ణ, అటవీ శాఖ రేంజర్ మురళి మండలంలోని రామన్నగూడెం గ్రామంలోని సర్వే నెం: 30, 36, 39లలో ఉన్న భూ సమస్య పరిష్కారం కోసం సోమవారం రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే ప్రారంభమైంది. ఈ సంయుక్త సర్వే ద్వారా ఆదివాసీ గిరిజనుల భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.