TG: హైదరాబాద్లోని నానక్రామ్గూడ కృతుంగ రెస్టారెంట్లో ఓ కస్టమర్ రాగిముద్ద ఆర్డర్ చేశాడు. అయితే, అది తింటుండగా.. రాగిముద్దలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో వినియోగదారుడు హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.