MNCL: అడవులు వన్యప్రాణులతోనే మనిషికి మనుగడ ఉంటుందని జన్నారం అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ అన్నారు. వన్యప్రాణుల వారోత్సవాలలో భాగంగా సోమవారం జన్నారంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం తాళ్లపేట FROలు మమత, సుష్మారావు పాల్గొన్నారు.