బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. వందేళ్లు దాటిన ఓటర్లు 14వేల మంది ఉన్నారు. 14.01 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయినట్లు పేర్కొంది.