NGKL: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం వంగూరు మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి సపోర్టుగా నిలవాలన్నారు.