KRNL: ప్రతి రైతూ బాధ్యతగా పంట నమోదు చేసుకోవాలని తుగ్గలి ఏవో సురేశ్ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 65 ఎకరాల్లో 59 ఎకరాలకు ఈకేవైసీ నమోదు చేశామన్నారు. పంట నమోదు చేసుకున్న రైతులు ప్రభుత్వం ప్రకటించే ధరకు ధాన్యం అమ్ముకోవచ్చని, బీమా వర్తిస్తుందన్నారు. మండలంలో పప్పు శెనగలు 2 వేలు క్వింటాలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు.