NLG: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించి పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి.