WNP: పానగల్ మండలం కేతేపల్లిలో షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమై కురుమయ్య కుటుంబం నిరాశ్రయులైంది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఘటనా స్థలాన్ని ఈరోజు పరిశీలించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. మంత్రి జూపల్లితో మాట్లాడి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.