BDK: ఇల్లందు నియోజకవర్గం బుద్ధారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం సురేందర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ..కార్యకర్తలను ఎట్టి పరిస్థితులలో వదులుకోమని అండగా ఉంటామని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.