SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు. ఆమదాలవలస మండలం కుమ్మరిపేట గ్రామానికి చెందిన డోలా గోపాలరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.72 వేల చెక్కును ఆమె సోమవారం గోపాలరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. వారు MLA రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.