KNR: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వార్డు, ల్యాబ్, మెడికల్ స్టోర్స్, ప్రసూతి గది తదితర విభాగాలను పరిశీలించారు. ఇక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.