‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనపై ప్రెస్మీట్లో హీరో అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన ACP సబ్బతి విష్ణుమూర్తి కన్నుమూశారు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీస్ శాఖలో విష్ణుమూర్తి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.