భారత వన్డే క్రికెట్ సారథ్యం నుంచి రోహిత్ శర్మను తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. రోహిత్ శర్మను సారథ్యం నుంచి తప్పించడం చేదు వార్తలకు ఆరంభమని చెప్పాడు. టీమిండియా మరిన్ని చేదు వార్తలకు సిద్ధం కావాలని పేర్కొన్నాడు. అలాగే, గిల్‌కు కెప్టెన్సీ అప్పగించడం సరైన నిర్ణయమేనని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.