MNCL: బెల్లంపల్లి మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చాకెపల్లి,చంద్రవెల్లి, పెర్కపల్లి గ్రామాల్లోని DCMSలలో బెల్లంపల్లి హనుమాన్ ఆగ్రోస్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. కూపన్స్ ఏమి అవసరం లేదన్నారు. ఎవరైనా దళారులు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.