MNCL: కుటుంబ కలహాలతో బీరేష్ (22) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేమనపల్లి మండలం రాజారాం గ్రామంలో చోటుచేసుకుంది. భోజనాల అనంతరం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బీరేశ్(22) ఇంటి నుంచి వెళ్లి ఎల్లమ్మ గుడి గుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు నీల్వాయి ఎస్సై కోటేశ్వర్ సోమవారం తెలిపారు.