HNK: శాయంపేట మండల కేంద్రం నుంచి కొత్తగట్టు సింగారం గ్రామం వైపు వెళ్లే రహదారిపై రోడ్డు ఇరువైపులా పెరిగిన పిచ్చి చెట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి పిచ్చి చెట్లను తొలగించాలని ప్రయాణికులు కోరారు.