SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో ఉన్న నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్లలో చేరికల కోసం మంగళవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బేతన స్వామి తెలిపారు. 2026 – 2027 విద్యా సంవత్సరం కొరకు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.