AP: విజయనగరంలో జరుగుతున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే ఏడాది ఉత్సవాల సమయానికి అమ్మవారి నూతన ఆలయం అందుబాటులోకి వస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.