NLG: మర్రిగూడ మండలం RRR కొత్త అలైన్ మెంట్ వల్ల నష్టపోయిన భూ బాధితులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం భీమనపల్లి, వట్టిపల్లి గ్రామాల బాధితులు HYDలోని HMDA కార్యాలయం ముందు ధర్నాకు వెళ్లే ప్రయత్నం చేయగా, స్థానిక పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. పాత అలైన్ మెంట్ ప్రకారమే RRR నిర్మాణం చేపట్టాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.