BHPL:టేకుమట్ల మండలంలో సోమవారం ఉదయం BJP మండల అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి హాజరై, మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో BJP జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.