KMM: ఐద్వా పాలేరు డివిజన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బెల్లం లక్ష్మీ, పెండ్యాల సుమతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో జరిగిన పాలేరు డివిజన్ ఐద్వా మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.