WGL: పట్టణంలోని ఏనుమాముల గ్రామానికి చెందిన MBBS విద్యార్థి అరుముల్లా గణేష్‌కు MLA కేఆర్ నాగరాజు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఇవాళ ఆర్థిక సహాయం అందించారు. తల్లిదండ్రులను కోల్పోయిన గణేష్, మేనమామ వద్ద పెరిగి కష్టపడి చదివి MBBS సీటు సాధించాడు. “విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురావు, గణేష్‌కు తోడుగా ఉంటాం” అని MLA హామీ ఇచ్చారు.