WGL: ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ విషయంలో ప్రముఖ పార్టీ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, SC వర్గానికి రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని దళిత ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ నెల 8న తీర్పు ఇవ్వనుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు సందిగ్ధంలో ఉన్నారు.