KDP: ఆదివారం, చక్రాయపేట మండలంలోని ఆంజనేయపురం సమీపంలో పాత తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ట్రాక్టర్ను, స్కూటర్ ఢీకొనడంతో మహేష్ (16) అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన మహేష్, తన తండ్రికి అన్నం ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన అతన్ని వేంపల్లెకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు సమాచారం.