JN: రేబిస్ వ్యాధితో బాధపడుతూ.. బాలుడు మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మైదం శ్రీనివాస్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లారు. ఇటీవల శ్రీనివాస్ కొడుకు చరణ్ (10) కు వీధి కుక్క కరిసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.