NZB: ఈ నెల 11,12వ తేదీలో జిల్లా కేంద్రంలో బహుళ జన బీడీ కార్మిక సంఘం రెండో మహాసభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహా సభకు మంత్రి సీతక్కతో పాటుగా పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ మహాసభను కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.