TG: సికింద్రాబాద్ వారాసిగూడ దుర్గా నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న దుర్గామాత విగ్రహానికి హైటెన్షన్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విగ్రహం దగ్ధమైంది. అప్రమత్తమైన యువకులు విగ్రహం పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.