KDP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా YCP పార్టీ ఖాళీ అవుతుందని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ జోష్యం చెప్పారు. మండలంలోని పెద్దపల్లి గ్రామపంచాయతీ శివునిపల్లె గ్రామంలో ఆదివారం వైసీపీ నుంచి దాదాపు 150 కుటుంబాలను జనసేన పార్టీలోకి రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.