NLR: కాకుటూరుకు చెందిన ముగ్గురు మైనర్లకు విముక్తి లభించింది. వీళ్లను బానిసలుగా చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఈక్రమంలో జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు దాడులు చేసి వారికి విముక్తి కల్పించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై శ్రీహరి బాబు, పోలీస్ సిబ్బంది రాంబాబు తెలిపారు.