NDL: బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న దర్గాలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాలో స్వామివారికి ప్రత్యేక పూలదట్టీలు సమర్పించి మైనార్టీ సోదరులు మత పెద్దలతో కలిసి స్వామివారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం దర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.