TPT: వయోవృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని TTD మరో మారు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా ‘రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD 3నెలల ముందుగానే ఆన్లైన్ టికెట్లు విడుదల చేస్తోంది అని టీటీడీ స్పష్టం చేసింది. కాగా తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు దర్శనానికి అనుమతిస్తారు.