ప్రకాశం: ఉపాధ్యాయులను గౌరవించడం విద్యార్థులు అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ భాష అన్నారు. కనిగిరిలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన గయాజు భాష మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.