CTR: చిత్తూరులో ఈ నెల 7వ తేదీన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని వివేకానంద భవన్లో ఉన్న సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు వేడుకలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.