WGL: ఉమ్మడి జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రైతులు, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో వరి, మొక్కజొన్న రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.