అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు కాలనీ సమీపంలో పంది దాడిలో మూడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు ఆడుకుంటుండగా పిల్లల పంది ఆ బాలుడిపై దాడి చేసింది. పరుగులు పెట్టినా వెంటబడి దాడిచేయడంతో బాలుడి మెహం, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.